నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ “అర్జున్ S/O వైజయంతి”. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈ రోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా సెకండ్ సింగిల్ – “ముచ్చటగా బంధాలే” సాంగ్‌ని లాంచ్ చేశారు.
Pradeep Machirachu: అందుకే కొంచెం టైం పట్టింది: ప్రదీప్ మాచిరాజు
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, “చిత్తూరు ప్రజలకు, ఇక్కడి విద్యార్థులకు, మా నందమూరి అభిమానులందరికీ లవ్ యు ఆల్. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే ‘అర్జున్ S/O వైజయంతి’. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది. కాలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్. ఇక్కడ ఎంజాయ్ చేయండి, బాధ్యతగా ఉండండి, నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నదే రేపు మనకు లైఫ్ ఇస్తుంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 12వ తేదీన మా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ఆ ఈవెంట్‌కి తమ్ముడు వస్తాడు. ఆ రోజు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఈ ఈవెంట్ అద్భుతంగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు,” అన్నారు.