Pradeep Machirachu: అందుకే కొంచెం టైం పట్టింది: ప్రదీప్ మాచిరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ప్రదీప్ గారు యాంకర్ గా యాక్టర్ గా ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది ?
-చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సరైన సమయంలో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు లభించింది. ఆర్జేగా, టెలివిజన్ యాంకర్ గా యాక్టర్ గా ఇన్నోవేటివ్ గా వర్క్ చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మంచి కథ చెప్పే ఛాన్స్ కుదిరింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశంగా భావిస్తున్నాను.
Also Read
- Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
- Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
- Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
- Vaishnavi : "గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు"
ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ అంతా కలిసి నిర్మించడానికి కారణం ఏమిటి?
-ఫస్ట్ సినిమా తర్వాత మరో మంచి కంటెంట్ ఉన్న సినిమాని చేయాలని ప్లాన్ చేశాం. చాలా కథలు విన్నాం. లక్కీగా ఈ కథ దగ్గర ఆగాం. ఈ కథకి ఫౌండేషన్ నుంచి వర్క్ చేసాం. అందుకే కొంచెం టైం పట్టింది. మా ఫ్రెండ్స్ సినిమా అంటే ఇంట్రెస్ట్. సినిమా అంటే పాషన్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ సినిమాని చేసాం. అందరం కలిసి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకున్నాం.
-ఫస్ట్ నుంచి లాస్ట్ చార్ట్ వరకు ప్రాపర్ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్లో హ్యాపీగా చూసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ మా నుంచి ఎలాంటి కంటెంట్ ని ఆశిస్తారో అలాంటి కంటెంట్ ఇందులో వుంది. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలాంటి కథ?
మా సినిమాలో కథే మంచి ఎంటర్టైన్మెంట్. దీన్ని ఒక చందమామ కథల చూడొచ్చు. అనగనగా ఒక ఊరు. అక్కడ ఓ అమ్మాయి. ఆ ఊరికి వెళ్ళిన ఒక సివిల్ ఇంజనీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయడం జరిగింది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ గురించి?
-ఇది పవన్ కళ్యాణ్ గారి టైటిల్. మా కథ అనుకున్నప్పుడే లక్కీగా ఈ టైటిల్ ని అనుకున్నాం . పవన్ కళ్యాణ్ గారి డెబ్యు సినిమా టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నామంటే మాపై బాధ్యత పెరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. టైటిల్ కు తగ్గట్టు చాలా చక్కని అచ్చ తెలుగు సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో ఒక సినిమా చేయడం మా అదృష్టం.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
-ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ఆడియన్స్ అంత ఎంటర్టైన్ అవుతారు. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. డైరెక్టర్స్ నితిన్ భరత్ భరత్ కు నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్ వాళ్ళకి తెలుసు. దానికి తగ్గట్టుగా ఈ కథని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.
హీరోయిన్ దీపికా పిల్లి గురించి?
ఈ సినిమా హీరోయిన్ పాత్రకు ఒక తెలుగు అమ్మాయి కావాలి. ఆడిషన్స్, లుక్ టెస్ట్, వర్క్ షాప్ అన్నీ చేసిన తర్వాతే దీపికని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తను చాలా అద్భుతంగా పెర్ఫర్మ చేసింది. ఆడియన్స్ డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు.
రదన్ మ్యూజిక్ గురించి ?
ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ జోనర్ లో చేయడం జరిగింది. రదన్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ఆడియన్స్ కి చాలా అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వుంటుంది. సినిమాని చాలా క్వాలిటీ గా తీసాం. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. క్వాలిటీ పరంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది.
డైరెక్టర్స్ నితిన్ భరత్ గురించి ?
నితిన్ భరత్ నన్ను సర్ప్రైజ్ చేశారు.డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపించలేదు. డేఫినెట్ గా చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి నితిన్ భరత్ ఇన్స్పిరేషన్ అవుతారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎక్కడ కూడా కొత్తవారితో పని చేసిన ఫీలింగ్ రాలేదు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.
-ఇందులో కామెడీ చాలా నేచురల్ గా కుదిరింది. కథ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కథలో కామెడీ ఉన్న సినిమా చేసి చాలా కాలమైందని బ్రహ్మానందం గారు మాకు కాంప్లిమెంట్ ఇచ్చారు.
-చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకునే సినిమా తీశారని సెన్సార్ సభ్యులు చెప్పారు. అది మాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ హాయిగా నవ్వుకునే సినిమా ఇది.
మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ గురించి?
-మైత్రి మూవీ మేకర్స్ సినిమా చూశారు. సినిమా పూర్తవ్వగానే డీల్ క్లోజ్ చేశారు. ఇది సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా అని రిలీజ్ డేట్ ని వారే లాక్ చేశారు. ఇది మాకు మరింత కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది.
తాజావార్తలు
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!