విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఆయన ప్రస్తుతం వర్క్ చేస్తోన్న మూవీ ‘విక్రమ్’. ఈసారి కూడా టాప్ స్టార్స్ ని తన చిత్రంలో ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. ‘లోకనాయకుడు’ కమల్ హసన్ హీరోగా నటిస్తుండగా ఆయనతో పాటూ విజయ్ సేతుపతి తెరపై కనిపించబోతున్నాడు. మరోవైపు, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ పాజిల్ కూడా ‘విక్రమ్’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
Read Also : “మారన్” ఫస్ట్ లుక్…. ధనుష్ బర్త్ డే స్పెషల్
కొద్ది రోజుల క్రితం ‘విక్రమ్’ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అఫీషియల్ గా పిక్చరైజేషన్ గురించి అనౌస్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్ అపడప్పుడూ క్రేజీ పిక్స్ తో ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. అయితే, తాజాగా మరో టాలెంటెడ్ యాక్టర్ పేరు కూడా కమల్ హాసన్ స్టారర్ ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది. హీరో తనయుడిగా మలయాళ యువ నటుడు కాళిదాస్ కనిపిస్తాడట. తెరపై కమల్ కొడుగ్గా కనిపించబోయే ఈ కుర్ర హీరో మరెవరో కాదు… రియల్ లైఫ్లో యాక్టర్ జయరామ్ తనయుడు! ‘విక్రమ్’ సినిమాలో కాళిదాస్ అప్ డేట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కానీ, ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అంటూ చెన్నైలో టాక్ వినిపిస్తోంది.
అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూరుస్తోన్న ‘విక్రమ్’ తమిళంలోనే కాక తెలుగు, మలయాళ భాషల్లోనూ హైప్ క్రియేట్ చేస్తోంది. చూడాలి మరి, లోకేశ్ కనకరాజ్… లోకనాయకుడు కమల్ ని… గ్యాంగ్ స్టర్ మూవీ ‘విక్రమ్’లో ఎలా ప్రజెంట్ చేస్తాడో!