Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కొందరు తన సినిమాపై కావాలని నెగిటివ్ చేస్తున్నారని వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజేష్ దండా చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. ఓ వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది.
Also Read : Bollywood : 68 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతున్న స్టార్ హీరో
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు. గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు.
ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది. నా బాధ, కోపం లో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్నకొందరిపై మాత్రమే’ అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!