GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!

Jr Ntr

Jr Ntr

Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ప్రీమియం మల్టీప్లెక్స్ వెంచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, సినీ వర్గాల్లో ఈ బజ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

“మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన ఫుట్‌ప్రింట్‌ను ప్రీమియం మల్టీప్లెక్స్ రంగంలోనూ విస్తరించబోతున్నారు” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ‘డ్రాగన్’ విషయానికి వస్తే.. సెన్సెషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై ఎన్టీఆర్ నుంచి గానీ, ఆయన టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎలా వస్తుందన్నది.