ఢిల్లీ హైకోర్టులో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా దాఖలు చేసిన ‘పర్సనాలిటీ రైట్స్’ (వ్యక్తిత్వ హక్కులు) పిటిషన్లపై నేడు కీలక విచారణ జరిగింది. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలను వాణిజ్యపరంగా వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని సోషల్ మీడియా సంస్థలకు, ఈ కామర్స్ సంస్థలకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా…
టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదుల మేరకు కీలకమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫిర్యాదులపై సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్స్ మూడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్…