తమిళ స్టార్ హీరో జయం రవి ఇటీవల అయన భార్య ఆర్తిరవితో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నామని లేఖ విడుదల చేసాడు. అయితే జయం రవి విడాకుల పట్ల తాను ఆశ్చర్యానికి లోనయ్యాను అని కలిసి కూర్చుని మాట్లాడానికి తానూ ప్రత్నిచించిన రవి కనీసం స్పందించలేదు. మా విడాకుల వ్యవహారం మా పిల్లల జీవితంపై ప్రభావం చూపకుండా చూసుకుంటాను అని మరో లేఖ రిలీజ్ చేసింది ఆర్తి రవి.
Also Read : Sudheer Babu : సుధీర్ బాబు పెళ్లి వేడుక ఛాలెంజ్ వీడియో చూసారా..?
అయితే జయం రవి, ఆర్తి రవి ల విడాకులకు కారణం తమిళ స్టార్ హీరో అని మొదట్లో వినిపించింది. కానీ అది అవాస్తవం అని అసలు వారి విడాకులకు ముఖ్య కారణం [ప్రముఖ సింగర్ కెనీషాతో జయం రవికి శారీరక సంబంధం అని గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఆ సింగర్ కోసమే జయం రవి తన భార్యకి విడాకులు ఇచ్చాడని కోలీవుడ్ కోడై కూసింది. దీంతో సింగర్ కెనీషా పై జయం రవి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. కాగా తన పై జరుగుతున్న ట్రోల్స్ కు సింగర్ కెనీషా స్పందించింది. కెనీషా మాట్లాడుతూ “జయం రవికి నాకు మధ్య శారీరక సంబంధం లేదు. ఇది నిజం. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్ సంబంధమే. ఆయన నాకు బిజినెస్ లో సపోర్ట్ చేస్తున్నారు అంతే. అన్నిటికి మించి జయం రవి నాకు మంచి మిత్రుడు. అందరూ అనుకుంటున్నట్లు జయం రవి విడాకుల నిర్ణయానికి కారణం నేను కాదు. నా పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు” అంటూ సింగర్ కెనీషా ఓ ఇంటర్వ్యూలో కోరారు.