బాలీవుడ్‌లో పది సినిమాలు చేసినా రాని క్రేజ్.. ఒక్క సౌత్ సినిమాతో తెచ్చుకుంది ఆ క్యూటీ. ఇప్పుడు సౌత్ బెల్ట్‌పై మరింత మమకారం పెంచుకుంటోంది. ఎంతైనా ఆమె బ్లడ్‌లోనే ఉంది. బాలీవుడ్ స్టార్ డాటర్ జాన్వీ కపూర్‌కు అమాంతంగా సౌత్‌పై ప్రేమ పొంగిపోయింది. బీ-టౌన్‌లో టెన్ మూవీస్ చేసినా రాని ఇమేజ్.. తెలుగులో దేవర చేయడంతో హోల్ సౌత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమెకు యువరాణిగా పట్టం కట్టారు సౌత్ ఆడియన్స్. ఇక ఈ క్రేజ్ ఎంజాయ్ చేస్తోంది జాన్వీ. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 14న తమిళ, కేరళ ప్రజలు జరుపుకునే విషు నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని విషెస్ తెలిపింది బోనీ-శ్రీదేవి డాటర్.
Preity Mukhundhan: ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలకు పోటీగా మారిన అండర్ రేటెడ్ హీరోయిన్
మీ అందరికీ రాబోయే సంవత్సరం ప్రేమ, శ్రేయస్సు, ఆనందంతో నిండాలని, నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి.. మీలో ఒకరిగా భావించేలా చేశారంటూ తమిళంలో, మలయాళంలో విష్ చేసి మెస్మరైజ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఈ భాష నేర్చుకుంటున్నానంటూ తప్పులుంటే క్షమించమని తెలిపింది. అలాగే టూ పిక్స్ పంచుకుంది. కేరళ శారీతో పాటు మరో చీరలో మెరిసింది జాన్వీ. ఎప్పుడూ లేని విధంగా సౌత్ ప్రజలకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ తన అభిమానాన్ని కురిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోలపై సోదరీమణులు స్పందిస్తూ… ఓ మై గాడ్ బ్యూటీ.. సో ప్రౌడ్ ఆఫ్ రాజా అంటూ ఖుషీ కపూర్ అండ్ మహేశ్వరి కామెంట్ చేయడం కొసమెరుపు. విషు సందర్భంగా పరమ్ సుందరి నుండి పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో కేరళ కుట్టీగా కనిపించబోతుంది జాన్వీ కపూర్. జులై 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో చరణ్ సరసన పెద్ది సినిమా చేస్తోంది. అమ్మలాగే తనను కూడా సౌత్ ఇండియా నెత్తిన పెట్టుకున్నట్టు గ్రహించిన జాన్వీ.. ఇక్కడ సక్సీడ్ అవుతుందో లేదో…? మరింత ఫోకస్ చేస్తుందో లేదో..? వెయిట్ అండ్ సీ.