Jai Bolo Telangana Heroine Meera Nandan ties knot at Guruvayur temple: సౌత్ ఇండియన్ భాషల్లో నటించి ఫేమస్ అయిన నటి మీరా నందన్ ఈరోజు ఉదయం గురువాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటి మీరా నందన్ కేరళకు చెందిన వారు. కొచ్చిలో పుట్టి పెరిగిన ఆమె ముందుగా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సీరియల్ నటిగా మారగా ఆ తర్వాత వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. ఆమె 2007లో ప్రసారమైన వీడు అనే సీరియల్‌తో మలయాళ బుల్లితెర పరిశ్రమలో అడుగుపెట్టింది. తర్వాత 2008లో మలయాళ చిత్రం ‘ముల్లా’లో నటించింది. 2009లో అఖిల్ హీరోగా తమిళంలో నటించిన ‘వాల్మీకి’ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మీరా. కానీ ఆమె నటించిన మొదటి సినిమా పరాజయం పాలైంది.
Kalki 2898 AD Part 2: కల్కి 2 రిలీజ్ అప్పుడే.. షూటింగ్ ఎంత అయిందంటే?
అయితే 2011 లో జైబోలో తెలంగాణ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తరువాత 2015లో హితుడు, 2017లో 4త్ డిగ్రీ అనే సినిమాలు చేసినా తెలుగులో సరైన గుర్తింపు దొరకలేదు. తమిళం, తెలుగు, కన్నడ వంటి భాషల్లో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. అందుకే మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. నటిగానే కాకుండా, రేడియో జాకీ, మోడల్ యాంకర్ గా కూడా పేరు తెచ్చుకున్న మీరా నందన్, ప్రియుడు బ్యూ శ్రీజుని ఈ ఉదయం గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లి చాలా సింపుల్ గా జరిగినా రిసెప్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం మీరా నందన్ – శ్రీజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.