Aswani Dutt Reveals Kalki 2898 AD Part 2 Release Date: ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన అశ్వినీ దత్ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ గురించి షూటింగ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Krishna in Kalki 2898 AD: సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూపిద్దాం అనుకున్నాం.. కానీ?
సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తయిందా అని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ కొంత భాగం పూర్తయింది ఇప్పటికే మూడు వేల అడుగుల ఫుటేజ్ మా దగ్గర ఉంది అని ఆయన అన్నారు. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే ముందు ఇప్పుడు అది ఏమీ ఆలోచించలేదు అని పేర్కొన్న ఆయన బహుశా వచ్చేయడాది ఇదే సమయంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అన్నారు. అంతేకాక కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రస్తుతానికి ఈ రెండు భాగాలు మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నామని ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత అవకాశం ఉంటే మళ్లీ ఈ యూనివర్స్ లో భాగంగా సినిమాలు చేస్తారేమో నాగ్ అశ్విన్ నిర్ణయానికే వదిలేస్తున్నామని అన్నారు. ఇక నాగ్ అశ్విన్ గురించి కూడా అశ్విని దత్ ప్రశంసల వర్షం కురిపించారు.