ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. అదే జోష్ లో మరో రెండు సినిమాలను ప్రకటించాడు ధనుష్. అందులో ఒకటి ‘NEEK’ ఈ సినిమాకు డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న మరోసినిమా ‘ఇడ్లీ – కడాయ్’.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే
తిరు వంటి సూపర్ హిట్ సినిమాలో ధనుష్ కు జోడిగా నటించిన నిత్యామీనన్ ‘ఇడ్లీ – కడాయ్’ లో హీరోయిన్‌గా నటిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ పై డాన్ పిక్చర్స్ , వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే ముఖ్య పాత్రలో నటిస్తోంది. ప్రకాష్ రాజ్ విభిన్నమైన రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘ఇడ్లీ – కడాయ్’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసాడు ధనుష్. మధ్య యువస్కుడి పాత్రలో ధనుష్ ఫస్ట్ లుక్ సూపర్బ్ గా ఉండనే చెప్పాలి. ధనుష్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ‘ఇడ్లీ – కడాయ్’ ధనుష్ డైరెక్ట్ చేస్తున్న నాలుగవ సినిమా. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేసాడు ధనుష్. ఇక మరోవైపు ధనుష్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ‘కుబేర’ రిలిజ్ కు రెడీ అవుతోంది.