ప్రజంట్ రష్మిక పేరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతగా మారుమ్రోగి పోతుందో చెప్పక్కర్లేదు. ‘యానిమల్’ మూవీతో యుత్ కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో శ్రీవల్లి స్టార్ హీరోయిన్‌గా అవరించింది. ఇక ‘ఛావా’ మూవీ తో నటిగా కూడా కితాబులందుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ‘సికిందర్’ చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది.
Also Read: Nag Ashwin : ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాల్సిందే
మార్చి 28న రంజాన్ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్, రాష్మిక జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ‘జోరా జబిన్’, ‘బమ్ బమ్ భోలే’ పాటలు ఇప్పటికే విడుదలై హిట్ అవ్వగా, ఇప్పుడు ‘సికిందర్ నాచే’ అనే టైటిల్ ట్రాక్ పాట టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఇద్దరి డాన్స్ అదిరిపోయింది. అయితే విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సల్మాన్ గురించి వైరల్ కామెంట్స్ చేసింది..
‘ నేను సల్మాన్‌ఖాన్‌కు వీర అభిమానిని. ఆయనతో నటించాలనేది నా కల. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. లొకేషన్‌లో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ప్రతి విషయంలోనూ పూర్తి క్లారిటీతో ఉంటారు. ఎంత కష్టమైన యాక్షన్ సన్నివేశాలు చేసినా.. ఆయనలో ఫ్రెష్‌నెస్ మాత్రం అలాగే ఉంటుంది. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో యాక్టీవ్‌గా కనిపిస్తారు. నా ఆరోగ్యం బాగుండకపోతే ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు. ఆయన అంతపెద్ద సూపర్‌స్టార్ ఎందుకయ్యారో కలిసి పనిచేస్తుంటే తెలిసింది’ అని తెలిపింది రష్మిక మందన్నా.