పరేశ్ రావల్, శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రల్లో ‘హంగామా 2’ విడుదలకి సిద్ధమైంది. జూలై 16న డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే, తాజాగా జనం ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే ఎవరికైనా 1994 మలయాళ చిత్రం ‘మిన్నారమ్’ గుర్తుకు రాక మానదు. అప్పట్లో డైరెక్టర్ ప్రియదర్శనే మోహన్ లాల్ తో ఆ సినిమాని తెరకెక్కించాడు. అదే సినిమా ‘హంగామా 2’గా ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. బాలీవుడ్ లో తన మలయాళ మాతృకని ప్రియదర్శనే లెటెస్ట్ గా రీమేక్ చేశాడు. కాకపోతే , ‘హంగామా’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘హంగామా 2’నే కాదు… ‘హంగామా’ ప్రాంఛైజ్ లో మొదటి చిత్రం కూడా మలయాళ రీమేక్ గానే హిందీకి వచ్చింది…
Read Also : పెట్ యానిమల్స్ మీద దీపికా పదుకొణే పెట్టుబడులు!
2003లో ప్రియదర్శన్ అందించిన బాలీవుడ్ ఎంటర్టైనర్ ‘హంగామా’. ఆ సినిమా ఆయనే మలయాళంలో తీసిన 1984 నాటి చిత్రం ‘పూచక్కొరు మూకుతి’కి హిందీ రీమేక్. 18 ఏళ్ల కింద తన కామెడీ రీమేక్ తో సూపర్ హిట్ కొట్టాడు ప్రియదర్శన్. ఇప్పుడు ‘హంగామా 2’ సీక్వెల్ తోనూ తన రీమేక్ ఫార్ములా అమలు చేస్తున్నాడు. చూడాలి మరి, 2003లో ‘హంగామా’ హంగామా చేసినట్టు… ఇప్పుడు ‘హంగామా 2’ హంగామా చేయగలుగుతుందో లేదో…