సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన లభించింది.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
Also Read : Pawan Kalyna : OG.. ఉస్తాద్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి పవన్ ?
ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గా వస్తున్న ఈ సినిమాకు ‘ విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ నుండి జాక్ పాట్ తగిలింది. సూర్య గత సినిమా రెట్రో ప్లాప్ అయినా కూడా ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి గత సినిమాలు సార్, లక్కీ భాస్కర్ లు ఓటీటీలో సెన్సేషన్ చేసాయి. లక్కీ భాస్కర్ అయితే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినపుడు వరల్డ్ వైడ్ గా నెల రోజుల పాటు టాప్ లో ట్రేండింగ్ లో నిలిచింది. దాంతో ఇప్పడు సూర్యతో చేస్తున్న ఈ సినిమాను రూ. 80 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. సూర్య సినిమాతో నిర్మాత నాగవంశీకి జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. మినిమం బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగవంశీ ఓటీటీ రూపంలో భారీ లాభాలు చూసారని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా G.V ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.