మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయూ అంటూ బాలయ్య పక్కన హుషారుగా చిందులేసిన మలయాళ సోయగం హనీ రోజ్. ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టీకి ఫేమ్ వచ్చినంత ఫాస్ట్‌గా ఛాన్సులు రాలేదు. అయితే ఆమె ఇప్పుడు ఏకంగా బాలయ్యతోనే కయ్యానికి సిఇద్దమైంది. అదేంటి అనుకుంటున్నారా? బాలయ్య డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఆమె తన సినిమాను రంగంలోకి దించుతోంది. అసలు విషయం ఏమిటంటే ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక మూవీ రాహేలు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు డబుల్ చేశాయి. రీసెంట్లీ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ చేస్తుంది హనీ రోజ్. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న రాహేలు జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియన్ లెవల్లో థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు.
Pushpa 2 : రాజమౌళి మాటలను నిజం చేసిన చూపించిన సుకుమార్
మలయాళంతో సహా తెలుగు, తమిళ్,హిందీలో కూడా మూవీ రిలీజ్ అవుతోంది. ఇక ఇక్కడే కొత్త సమస్య స్టార్టైంది. ఎందుకంటే.. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుంటే.. ఉన్నపళంగా ఊడిపడింది రాహేలు. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుండగా.. ఇప్పుడు రాహేల్ కూడా ఇదే డేట్‌న వస్తోంది. పోనీ ఈ ఒక్కటే మూవీ అనుకుంటే పొరపాటు.. కోలీవుడ్ నుండి అజిత్ విదాముయర్చి, బాల- అరుణ్ విజయ్ వనంగాన్ ఈ పొంగల్‌లోనే బాక్సాఫీసు మీద దండయాత్ర చేస్తుంటే.. టాలీవుడ్ నుండి సీనియర్లు బాలకృష్ణ ఢాకూ మహారాజ్ జనవరి 12న, వెంకటేష్-అనిల్ రావిపూడి జనవరి 14న సంక్రాంతికి వచ్చేస్తున్నాం అంటూ ఫిక్సయ్యారు. ఇంత మంది హీరోల మధ్య ఒంటరిగా పోటీకి దిగుతోంది హనీ బేబీ. ఇంత బిగ్గెస్ట్ కాంపిటీషన్‌లో సినిమాపై ఏ నమ్మకంతో సింగిల్‌గా ఎంట్రీ ఇస్తోందో అమ్మడు..? అనే చర్చ జరుగుతోంది.