అల్లు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పుష్ప2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ షోతోనే బ్లక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది పుష్ప. అల్లు అర్జున్ నటనతో పాటు యాక్షన్ సన్నివేశాలలో మ్యారిజమ్స్,సాంగ్స్ లో బన్నీ డ్యాన్స్‌లు ఆడియన్స్ కు ఫుల్ జోష్ నిస్తున్నాయి. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ సోషల్ మీడియాలో అభిమానులు కెమెంట్స్ చేస్తున్నారు. జాతర ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ మరో స్థాయిలో నటించారంటూ పొగిడేస్తున్నారు. ఈ సినిమా బన్నీ నట విశ్వరూపమంటున్నారు ప్రేక్షకులు.
Also Read : GV Prakash Kumar : దర్శకుల చూపు జీవీ ప్రకాష్ వైపు.. ఎందుకంత స్పెషల్..?
ఇక ఈ సినిమాలో బన్నీతో పాటు దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ సీన్ ని ప్రతీ ఫ్రేమ్ ను సుకుమార్ డిటైల్డ్ గా మలిచాడు. సినిమాలో నటించిన ప్రతి ఒకరి నుండి తనకు ఎంత కావాలో అంత పర్ఫామెన్స్ రాబట్టాడు సుకుమార్. ఇక సినిమా చుసినవారుచేప్పే మాట ఒకటే అసలు ఇది సుకుమార్ సినిమానేనా. గతంలో SS రాజమౌళి ఓ వేదికపై మాట్లాడుతూ ‘సుకుమార్ క్లాస్ సినిమాలు వదిలేసి మాస్ సినిమాలు చేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు’ అని అన్నారు. ఇప్పుడు ఆ మాటలను గుర్తు చేస్తూ సుకుమార్ పుష్ప 2 తో రాజమౌళి మాటలను నిజం చేసి చూపించాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఈ సినిమాను కేవలం బన్నీపై ప్రేమతో మాత్రమే చేశాను అని చెప్పిన సుకుమార్ వాటినిన్ తూచా తప్పకుండా పాటించి అల్లు అర్జున్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు సుకుమార్.