సూపర్ టాలెంటెడ్ నటుడు సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం “వసంత ముల్లై”. ఇందులో సింహా సరసన కాశ్మీర పర్దేషి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ మురుగేసన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఎస్ఆర్టి ఎంటెర్టైన్మెంట్స్, ముద్ర యొక్క ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో “వసంత ముల్లై”గా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ తెలుగులో “వసంత కోకిల”గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Read Also : అజిత్ ‘వాలిమై’ ఫస్ట్ లుక్ అప్పుడేనా?
“వసంత కోకిల” టీజర్ చూస్తుంటే… అందులో ఓ ప్రేమ జంట అనుకోని భయంకర పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు కన్పిస్తోంది. తెలియని వ్యక్తి నుండి ఈ జంటకు ముప్పు పొంచి ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే అది ఎవరు ? కథ ఏమై ఉంటుందనే విషయాన్ని మాత్రం టీజర్ లో రివీల్ చేయకుండా సస్పెన్స్ లోనే ఉంచారు మేకర్స్. కానీ టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మీరు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ “వసంత కోకిల” టీజర్ పై ఓ లుక్కేయండి.