రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం “గేమ్ ఛేంజర్”. పాన్ ఇండియా భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారతీయుడు-2 చిత్రం కారణంగా వాయిదా పడింది. భారతీయుడు-2 విడుదల కావడంతో శంకర్ గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చారు. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.
నేడు చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న భామ కియారా అద్వాని పుట్టినరోజు కానుకగా తమ జాబిలమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంద్రధనస్సులోని రంగులను పొందుపరిచిన పొడవాటి డ్రెస్ ధరించిన కియారా అద్వాని వెనుక నిర్మించిన భారీ సెట్స్ మధ్య కుందనపు బొమ్మలాగా యద అందాలతో అతి సుందరంగా మెరిసిపోతుందని చెప్పాలి. కాసేపటి క్రితం విడుదల చేసిన ఈ పోస్టర్ నెటిజన్స్ తో ప్రశంసలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. రామ్ చరణ్ కు సంబంధించి 10 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ పూర్తి చేసి సెకండ్ సింగిల్ ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తారని యూనిట్ టాక్. అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించాడు.
Also Read: Gopichand: గోపిచంద్, శ్రీనువైట్ల హిట్ కొడతారంటారా..?