హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.
Also Read:Prabhas : ప్రభాస్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రులతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి హాజరు కాబోతున్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు బ్రహ్మానందం ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. గతంలో సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో పోలీసులు శిల్పకళా వేదికలోని సీటింగ్ కెపాసిటీలో సగానికంటే తక్కువ మందికి మాత్రమే లోపలికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. 1000 మందికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అయితే, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శిల్పకళా వేదిక వద్ద వారి కోలాహలం కనిపిస్తోంది.
