హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.…