హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైంది. అయితే సినిమా అనేక వాయిదాలు పడుతూ ఉండడంతో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు, పలు సినిమాలు డైరెక్టర్ చేసిన జ్యోతి కృష్ణ రంగంలోకి దిగాడు. నిజానికి ఈ సినిమాని ఈనెల 28వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు కానీ ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. తాజాగా ఈరోజు నుంచి తాడేపల్లిలో సత్యరాజ్, ఈశ్వరి రావు కాంబినేషన్లో కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు.
SSMB29: అవుట్ డోర్ షూట్ కోసం బయలుదేరిన మహేష్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో పాటు జనసేన పార్టీ అధినేతగా ఉండడంతో ఆయన ఏపీ అసెంబ్లీ సెషన్స్ లో బిజీగా ఉన్నారు. అవి పూర్తి అయిన వెంటనే ఆయన హరిహర వీరమల్లు సెట్స్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఇంకా నాలుగు రోజులపాటు కేటాయిస్తే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తవుతుంది మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిస్థాయిలో ముగింపు దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కి హాజరు అయితే వెంటనే సినిమాని పూర్తి చేద్దామని దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఒకసారి షూట్ పూర్తి అయిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన కొల్లగొట్టినాదిరో అనే పాట వైరల్ అవుతుంది.