కోలీవుడ్ మల్టీ టాలెంట్ యాక్టర్ శింబు సినిమాలతో కన్నా గర్ల్ ఫ్రెండ్స్ ముచ్చట్లతో ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. కానీ అదంతా గతం. రూమర్లకు కాస్త దూరంగా హిట్స్‌కు దగ్గరవుతూ ట్రాక్ ఎక్కాడు ఎస్టీఆర్. ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్టులతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే కంప్లీటైన మణిరత్నం ఫిల్మ్ థగ్ లైఫ్ జూన్ 5న ప్రేక్షకులను పలకరించబోతుంది.
Also Read : Athadu4k : రీరిలీజ్ లో రికార్డ్ ధర పలికిన మహేశ్ ‘అతడు’
‘పట్టుదల’ తర్వాత శింబు సోలో హీరోగా త్రీ ఫిల్మ్స్ ఎనౌన్స్ మెంట్స్ జరిగాయి. పార్కింగ్ ఫేం రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో శింబు 49లో నటిస్తున్నాడు ఒకప్పటి లవర్ బాయ్. తన 50th మూవీ ఛాన్స్ దేసింగు పెరియసామి చేతికి కిచ్చాడు. కనులు కనులు దోచాయేంటేతో ఫ్రూవ్ చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. యాక్చువల్లీ ఇది 48th మూవీగా తెరకెక్కాల్సి ఉండగా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల శింబు 50వ చిత్రంగా రాబోతుంది. ఈ సినిమాను శింబునే నిర్మిస్తున్నాడు. శింబు 51ని డ్రాగన్ ఫేం అశ్వత్ మారిముత్తు డీల్ చేస్తున్నాడు. ‘గాడ్ ఆఫ్ లవ్’ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ ప్రాజెక్టులన్నీ ఎనౌన్స్ మెంట్స్ జరిగాయి కానీ.. ఎంత వరకు కంప్లీట్ అయ్యాయో అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే శింబు మరో ఇద్దరు స్టార్ దర్శకుల్ని లైన్‌లో పెట్టాడని సమాచారం. ఇప్పటి వరకు యంగ్ అండ్ డైనమిక్ ఫిల్మ్ మేకర్లకు ఛాన్స్ ఇచ్చిన శింబు ఇప్పుడు రూట్ మార్చి సీనియర్లకు ఛాన్స్ ఇస్తున్నాడట. మణిరత్నంలో మరోసారి వర్క్ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. అలాగే సుధాకొంగర- హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించే భారీ బడ్జెట్ చిత్రంలో శింబు పేరే వినిపిస్తోంది. ఓ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారని సమాచారం. పరాశక్తి కంప్లీట్ అయ్యాక సుధాకొంగర ఈ ప్రాజెక్టుకి షిఫ్ట్ కానుంది.