సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ ఆ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. 2005 లో భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఓ మోస్తరు గా ఆడింది. కానీ బుల్లితెరపై సంచలన విజయం సాధించింది. అప్పట్లో అంతగా గుర్తించని ఈ సినిమా ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
Also Read : NBK : వీరసింహ రెడ్డి సినిమా వెనుక ఇంత డ్రామా నడిచిందా
కాగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్ లో జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ లో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. అలా మహేశ్ బాబు నటించిన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సినిమాలు రీరిలీజ్ లోను భారీ వసూళ్లు రాబట్టాయి. అయితే ఎప్పటినుండో మహేశ్ బాబు అభిమానులు ఎప్పటి నుండో అడుగుతున్న డిమాండ్ అతడు రీరిలీజ్. త్రివిక్రమ్ రైటింగ్ అలాగే ఈ సినిమాలోని మహేశ్ బాబు నటన, బ్రహ్మీ కామెడీ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ కిక్. మొత్తానికి ఇన్నాళ్లకు అతడు రీరిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు 50వ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అయితే ఈ రీరిలీజ్ లోనే అతడు అత్యధిక ధర పలికింది. దాదాపు రూ. 3.06 కోట్లుకు ఈ సినిమా రీరిలీజ్ హక్కులకును కాకినాడకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేసారు. బాబు బర్త్ డే కనుకగా వస్తున్న అతడు ఎలాంటి సంచలన విజయం నమోదు చేస్తుందో చూడాలి