Pushpa 2: గళ్ళ లుంగీ.. గన్ విత్ గొడ్డలితో ఫహాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fahadh Faasil Look From Puspa 2 Goes Viral: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. బన్వర్ సింగ్ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్ ఈ చిత్రంలో అంతకు మించి ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గళ్ళ లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో…మరో చేతిలో గొడ్డలితో ఫహాద్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Naga Chaitanya- Sobhita Dhulipala: ఇదంతా ముందే తెలుసా?
Also Read
- Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
- Mahesh Babu Birthday: మహేష్ బాబు బర్త్‌డేకు ఐకానిక్ బ్లాక్‌బస్టర్ రీరిలీజ్.. మళ్లీ సందడి చేయబోతున్న 'దూకుడు'
- Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
- Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రమోషన్ కంటెంట్ అంతా అందరిలోనూ అంచనాలు పెంచేలా ఉన్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. రోజురోజుకు అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్ బంప్స్ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. ఇక మరోపక్క రజనీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా వేట్టయాన్ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. బర్త్ డే బాయ్ ఫాజిల్ ఇద్దరు సూపర్ స్టార్లు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఉన్న ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!