Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: ‘ది ప్యారడైజ్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉన్న చిత్ర బృందం ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి పాల్గొన్న ప్రత్యేక చిట్‌చాట్‌లో మోహన్ బాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినీ రంగంలో నిలదొక్కుకోవడం ఎప్పుడూ పూలబాట కాదు. తరాలు మారినా, సాంకేతికత కొత్త పుంతలు తొక్కినా కెమెరా ముందుకు రావడానికి పడే తపన, శ్రమ ఎవరికైనా సమానమే. అయితే నాటి మద్రాస్ సినీ సామ్రాజ్యంలో అవకాశాల కోసం ఎదురుచూసిన పాత తరం నటుల కష్టాలు వేరు.. ఇప్పటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా స్క్రూటినీ నడుమ హైదరాబాద్‌లో ఎదిగిన నేటి తరం నటుల ప్రయాణం వేరని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నేచురల్ స్టార్ నాని మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మద్రాస్ (చెన్నై) సినీ పరిశ్రమలో ఒక చిన్న అవకాశం కోసం చెప్పులరిగేలా తిరిగిన రోజులను మోహన్ బాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “మేము అనుభవించిన స్ట్రగుల్, పడ్డ ఇబ్బందులు ఏ పగవాడికి కూడా రాకూడదు.. అన్ని కష్టాలు అనుభవించాం” అంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిండీతిప్పలు లేకుండా, సరైన ఆసరా దొరక్క ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రాణాలు ఒడ్డాల్సి వచ్చేదని ఆనాటి పరిస్థితులను వివరించారు. ఆ అనుభవాలు తలచుకుంటేనే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుందని, ఆ తరహా భయానక కష్టాలు ఏ కళాకారుడూ అనుభవించకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. నాని ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ మోహన్ బాబు ఆసక్తికర పోలిక తీసుకొచ్చారు. “నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటుడిగా ఎంతో హుందాగా, గౌరవప్రదంగా పని చేసుకుంటూ పైకి వచ్చావు.. మేము పడ్డ ఆ కష్టాలు నువ్వు పడలేవు, పడి ఉండకూడదు కూడా” అని స్పష్టం చేశారు. అప్పట్లో ఒక అవకాశం దక్కించుకోవడమే మహాభాగ్యమైతే, కథాబలం, స్వచ్ఛమైన ఒరిజినల్ స్టోరీటెల్లింగ్ మాత్రమే సినిమాను బతికించేవి. కానీ నేటి తరం హీరోలకు అవకాశాల కంటే ఎక్కువ సోషల్ మీడియా నిఘా, క్షణక్షణం మారే ప్రేక్షకుల తీర్పులు పెద్ద సవాలుగా మారాయని ఇద్దరి చర్చలో తేలింది. టెక్నాలజీ పెరిగి వేదికలు మారినా.. సినీ పరిశ్రమలో నిలబడటానికి చేసే యుద్ధం మాత్రం ఆగలేదని ఈ సంభాషణ స్పష్టం చేసింది. రెండు వేర్వేరు తరాల ప్రతినిధులు ఒకే వేదికపై కూర్చుని సినిమా కష్టాలపై మనసు విప్పి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
- SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
- AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
- Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
తాజావార్తలు
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!