Naga Chaitanya- Sobhita Dhulipala Relation Rumours by samantha team: బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన శోభిత ధూళిపాళ్ల.. తెలుగులో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మేజర్ సినిమా రిలీజ్ టైంలో ఈ బ్యూటీతో చైతు ప్రేమలో పడ్డాడనే న్యూస్.. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇందులో నిజం లేదని.. కావాలనే సమంత పీఆర్ టీమ్ ఈ పుకార్లు పుట్టించిందని.. చైతన్య టీమ్ వాదించింది. అంటే, ఈ ఇద్దరి మ్యాటర్ సమంతతో పాటు అక్కినేని ఫ్యామిలీకి ముందే తెలుసని.. ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పేశారన్నమాట. కానీ ఈ విషయంలో స్వయంగా సమంతనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, కానీ అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం.. అమ్మాయే చేయించిందంటారు.. మేము ఎప్పుడో మూవ్ అన్ అయిపోయాము.. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి.. మీ పని మీద, మీ కుటుంబాల పై దృష్టి పెట్టండని’ కాస్త సీరియస్ అయింది సామ్.
NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. అంతా గప్ చుప్!
కానీ చైతన్య, శోభిత మాత్రం ఈ దీనిపై స్పందించలేదు. పలు సందర్భాల్లో ఇద్దరిని అడిగితే.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని చైతన్య సన్నిహితులు, పీఆర్ టీమ్ నుంచి కాస్త గట్టిగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడితో.. ఈ ఇద్దరి మధ్య ఏమి లేదని, వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని.. అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ సడెన్‌గా ఎంగేజ్మెంట్‌తో షాక్ ఇచ్చారు చైతన్య, శోభిత. స్వయంగా అక్కినేని నాగార్జుననే శోభితాను తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించామని.. ఈ జంట కలకాలం ప్రేమతో సంతోషంగా కలిసి ఉండాలని.. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఏదేమైనా.. చైతన్య, శోభిత వ్యవహారం చూస్తుంటే.. రూమర్స్ ఊరికే రావని, నిప్పు లేనిదే పొగ రాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.