గత వారం బోలెడన్నీ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేశాయి. దీపావళికి పోటీ పడ్డ సినిమాలు డ్రాగన్, తెలుసు కదా, కె ర్యాంప్ పలు ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా కీర్తిస్వారన్ డైరెక్ట్ చేసిన డ్యూడ్ అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజై రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ అనుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 14 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : AnnapurnaStudios : అన్నపూర్ణ స్టూడియోస్ మరో ప్రయోగం..
థియేటర్ లో సూపర్ హిట్ అయిన డ్యూడ్ ఓటీటీలోను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చిన డ్యూడ్ మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ వారం టాప్ లో ట్రేడింగ్ అవుతుంది. ప్రదీప్, మమిత బైజు మధ్య ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ మెప్పించాయి. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. థియేటర్ ఆడియెన్స్ తో పాటు ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తూ మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది డ్యూడ్. ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ని విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతుండడంతో త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించాడు సాయి అభ్యంకర్. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మరికొన్నీ సినిమాలు ఓటీటీలో ప్లాప్ అయ్యాయి.