Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఈ సినిమా స్టోరీ గురించిన ఒక క్రేజీ అప్డేట్ను అఫీషియల్‌గా లీక్ చేశారు. అసలు ‘పెద్ది’ సినిమా దేని చుట్టూ తిరగబోతుంది? రామ్ చరణ్, తన పాత్రల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండబోతుందో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో రామ్ చరణ్, తన క్యారెక్టర్ల మధ్య ఉండే బాండింగ్ గురించి జగపతి బాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాలో రామ్‌చరణ్ ‘పెద్ది’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. వయసులో అతనికంటే చాలా పెద్దవాడైన ‘అప్పలసూర్య’ పాత్రను నేను చేస్తున్నాను. సినిమాలో మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య రిలేషన్ ఎంత క్లోజ్ అంటే ఒకరినొకరు ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలుచుకునే రేంజ్లో ఉంటుంది. ఈ ఇద్దరి రిలేషన్ షిప్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా మెయిన్ పాయింట్ ఏంటనేది చెబుతూ.. “ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే.. ‘గుర్తింపు’ (Identity). ఈ రోజుల్లో చాలామంది ఐడెంటిటీ క్రైసిస్ ఎదుర్కొంటున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతుంది. ఒక జెన్యూన్ ఐడెంటిటీ ప్రాబ్లం చుట్టూనే ఈ సినిమా మొత్తం కథ నడుస్తుంది. అందుకే డబ్బింగ్ చెప్పేటప్పుడు బుచ్చిబాబు నాతో ‘ఇదే కదా సార్ మన సినిమా కథ.. గుర్తింపు గురించే మన కథ’ అన్నాడు” అంటూ సినిమా అసలు పాయింట్‌ను బయటపెట్టారు జగపతి బాబు.
Also Read
డైరెక్టర్ సుకుమార్ సినిమాలైన ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ లలో తాను పక్కా బ్యాడ్ బాయ్ (విలన్)గా కనిపించాను. కానీ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు మాత్రం తనను ‘అప్పలసూర్య’ అనే ఒక గుడ్ బాయ్ పాత్రకు ఎలా ఎంచుకున్నారో ఇప్పటికీ అర్థం కాలేదని జగపతి బాబు అన్నారు. “నాకంటే ఆ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే నటులు చాలామంది ఉన్నారు. నన్ను అంతగా ట్రాన్స్‌ఫార్మ్ చేయడం కంటే వాళ్లనైతే ఈజీగా చూపించొచ్చు. కానీ బుచ్చిబాబు నాలో అప్పలసూర్యను ఎలా చూశాడో తెలీదు. దాన్నే డైరెక్టర్స్ విజన్ అంటారు. అందుకే నేను దర్శకులను అంతగా గౌరవిస్తాను. నాకంటే బెటర్ నటులు ఉన్నా ఈ పాత్ర నా దగ్గరికే రావడం నా డెస్టినీ (అదృష్టం)” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..