Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు తన నటనతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, నటన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్నకు జగపతి బాబు సమాధానమిస్తూ.. “నిజం చెప్పాలంటే నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం తెలియదు. ఆ విషయంలో నేను పూర్తిగా జీరో. నా లైఫ్‌లో, నా డిక్షనరీలోనే యాక్టింగ్ అనేదే లేదు అనుకుంటే నేను ఏమైపోయేవాడినో నాకే తెలియదు. నాకు బయట ఏదో చేసేయాలి, సాధించేయాలి అనే తపన కూడా అస్సలు ఉండదు. నాకున్న తపన, కసి అంతా ఒట్టి యాక్టింగ్‌లోనే చూపిస్తాను. నా తృప్తి అంతా నటనలోనే ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
కెరీర్లో ఒకే రకమైన పాత్రలు చేయడం తనకు అస్సలు నచ్చదని జగపతి బాబు స్పష్టం చేశారు. “నేను చేసిన పాత్రలనే మళ్లీ మళ్లీ చేస్తే నాకు బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎవరైనా సరికొత్త పాత్రతో నా ముందుకు వస్తే కచ్చితంగా చేయాలనుకుంటాను. కొత్తదనం ఉంటేనే నాకు చేయడానికి బాగుంటుంది” అని అన్నారు. దర్శకులతో పనిచేసే విధానం గురించి మాట్లాడుతూ.. “కొత్త డైరెక్టర్ అయినా, సీనియర్ డైరెక్టర్ అయినా నేను వాళ్లను ఒకటే అడుగుతాను.. ‘నేను ఏం చేయగలనో పక్కన పెట్టండి, ఈ పాత్ర కోసం మీకేం కావాలో చెప్పండి’ అని అడుగుతాను. వాళ్ల విజన్ ఏంటో చెబితేనే పాత్రలో కొత్తదనం వస్తుంది. లేదంటే నేను గతంలో చేసిన యాక్టింగే మళ్లీ రిపీట్ అవుతుంది” అని అన్నారు. ఇకపోతే పెద్ది విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!