షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 Launched: షియోమీ (Xiaomi) తన కొత్త ఎకోసిస్టమ్ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. Xiaomi 17T & Xiaomi 17T Pro స్మార్ట్ఫోన్లతో పాటు కంపెనీ Xiaomi Watch S5 46mm, Xiaomi Smart Band 10 Pro, Xiaomi Buds 6లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. ప్రీమియం డిజైన్, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, మంచి బ్యాటరీ లైఫ్ సపోర్ట్‌తో ఈ కొత్త గాడ్జెట్స్ అందుబాటులోకి రానున్నాయి.
Xiaomi Watch S5:
షియోమీ Watch S5 46mm స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో స్టైలిష్ డిజైన్‌లో వచ్చింది. ఈ వాచ్ 46 గ్రాముల బరువుతో ఉండగా, 10.99mm మందం మాత్రమే కలిగి ఉంది. బిజినెస్, ఫిట్నెస్, డైలీ యూజ్ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీనిని రూపొందించింది. వాచ్‌లో స్టెయిన్లెస్ స్టీల్, సెరామిక్ అండ్ ఫోర్జ్డ్ కార్బన్ బెజెల్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.48 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. ఇందులో 815mAh బ్యాటరీ ఉండగా.. ఇది సాధారణ వినియోగంలో ఒకసారి చార్జ్ చేస్తే 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతుంది.
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, కాలరీ ట్రాకింగ్, స్లీప్ HRV, 150కు పైగా స్పోర్ట్స్ మోడ్లు, డ్యూయల్ బ్యాండ్ GPS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ వాచ్ Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. రిమోట్ కెమెరా కంట్రోల్, Find My Phone, Xiaomi Home స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్, ఇయర్‌ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. దీని ధర EUR 179.99 నుంచి ప్రారంభమవుతుంది.

Xiaomi Smart Band 10 Pro:
షియోమీ Smart Band 10 Proను కూడా గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫిట్నెస్ బ్యాండ్ కేవలం 9.7mm మందంతో, 21.6 గ్రాముల బరువుతో వస్తోంది. 1.74 అంగుళాల AMOLED డిస్ప్లే అండ్ 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఇది ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఈ బ్యాండ్ 98.2% ఖచ్చితత్వంతో హార్ట్‌రేట్ మానిటరింగ్ అందించనున్నది. 150కు పైగా స్పోర్ట్స్ మోడ్లు, ట్రాక్ రన్నింగ్ మోడ్, అడ్వాన్స్డ్ స్లీప్ అనాలిసిస్, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Clue యాప్ భాగస్వామ్యంతో మహిళల ఫెర్టిలిటీ, మెన్స్ట్రువల్ ట్రాకింగ్‌కు ప్రత్యేక సపోర్ట్ అందిస్తున్నారు. ధర EUR 79.99 కాగా, సిరామిక్ ఎడిషన్ ధర EUR 99.99గా ఉంది.

Xiaomi Buds 6:
షియోమీ బడ్స్ 6ను ఫ్లాగ్షిప్ సెమీ-ఇన్-ఇయర్ ఇయర్‌బడ్‌లుగా పరిచయం చేసింది. ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 4.4 గ్రాములు మాత్రమే. 11mm ట్రిపుల్-మాగ్నెట్ డ్రైవర్, 24K గోల్డ్ ప్లేటెడ్ డయాఫ్రాగమ్, Qualcomm aptX లాస్ లెస్ సపోర్ట్‌తో హై క్వాలిటీ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. బడ్స్ 6లో 3-మైక్ AI నాయిస్ రిడక్షన్ సిస్టమ్ ఉంది. ఇది 95dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది. 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో, హెడ్ ట్రాకింగ్, డీప్ అండ్ బ్యాలన్సడ్ ANC మోడ్లు వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవాన్ని ఇస్తాయి. ఆపిల్ ఫైండ్ మై & గూగుల్ ఫైండ్ హబ్ సపోర్ట్ కూడా ఇందులో ప్రత్యేకంగా ఉంది. Xiaomi Buds 6 ధర EUR 119.99గా నిర్ణయించారు.

తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!