టాలీవుడ్లో ‘లోఫర్’ మూవీలో కెరీర్ స్టార్ చేసిన నార్త్ బ్యూటీ దిశా పటానీ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కానీ హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. దీంతో బీ టౌన్ బాట పట్టిన ఈ స్టన్నింగ్ బ్యూటీ అక్కడ బాగానే క్లిక్ అయ్యింది . బాఘీ2, భారత్, మలంగ్ హ్యాట్రిక్ హిట్టుతో మేడమ్ రేంజ్ మారిపోయింది. కానీ ఈ ఆనందం నెక్స్ట్ సినిమాలతో పోయింది. ‘రాధే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధ’ తో వరుస హ్యాట్రిక్ ప్లాపులు తెచ్చుకుని కెరీర్ గ్రాఫ్ డౌన్ చేసుకుంది దిశా పటానీ. ఆ టైంలో సౌత్ నుండి ఆఫర్లు వచ్చాయి.
Also Read : Samyuktha Menon : మలయాళ కుట్టీకి పెరుగుతున్న డిమాండ్..
ఊహించని సిద్ధంగా ప్రభాస్ ‘కల్కి’.. సూర్యతో ‘కంగువా’ లో యాక్ట్ చేసింది దిశా. కానీ‘కంగువా’ తో ఖంగుతినిపించిన.. ‘కల్కి’తో గట్టి కం బ్యాక్ కొట్టింది. కానీ ఏం లాభం ఇంతటి భారీ హిట్ కొట్టిన ఆఫర్లు మాత్రం రావడం లేదు దిశాకు. ప్రజెంట్ ఆమె చేతిలో ‘వెల్కమ్ టు ది జంగిల్’ మూవీ మాత్రమే ఉంది. దీంతో మేడమ్ హాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఆస్కార్ విన్నింగ్, యాక్టర్ అండ్ డైరెక్టర్ కెవిన్ స్పాసే దర్శకత్వంలో ‘హోలీ గార్డ్స్’ అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ముఖ్యపాత్ర లో నటిస్తోంది దిశా. బియాండ్ ది సీ తర్వాత యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేసిన కెవిన్.. ఇన్నాళ్లకు కెమెరా పై కాన్సంట్రేషన్ చేస్తున్నారు. రీసెంట్లీ దిశా పటానీ షూటింగ్స్‌లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి ఈ హాలీవుడ్ మూవీ తోనైనా దిశా పటానీ.. దశ తిరుగుతుందా…? చూడాలి.