టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది కావొస్తుంది. ‘బింబిసార’,‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస భారీ హిట్స్‌తో, తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ. ‘డెవిల్’ మూవీ ప్లాప్ అందుకున్నప్పటికి వరుస సినిమాలు కమిటౌతుంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకు రావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త.. డిమాండ్ ఉన్నప్పుడే వరుస చిత్రాలకు కమిటవుతోంది. చకా చకా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఫెల్యూర్ హీరోయిన్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది.
Also Read : Akshi Kumar : బాలీవుడ్ ‘హౌస్‌ఫుల్ 5’ మూవీకి సెన్సార్ దెబ్బ..!
టాలీవుడ్… బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. కాగా తెలుగులో ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘స్వయంభు’, ‘హైంధవ’, ‘అఖండ2’తో పాటు నిర్మాతగా మారి నటిస్తోన్న ‘రాక్షసి’ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండు సినిమాలో నటిస్తుంది. ఇవి కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఇవే కంప్లీట్ కాలేదు అనుకుంటే.. రీసెంట్‌గా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శల్‌లో తెరకెక్కుతోన్న‘బెంజ్’ చిత్రానికి కమిటయ్యింది. ‘సార్’ తర్వాత ఆమె నటిస్తున్న తమిళ్ మూవీ ఇదే. ఇవన్నీ షూటింగ్ దశలో ఉండటంతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు అమ్మడు.