తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్ని.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దిశ పటాని ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో ‘లోఫర్’ అనే సినిమాతో పరిచయం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ అమ్మడుకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. స్కిన్ షో తో కట్టిపడేసింది.. కానీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత వరుస అవకాశాలు అందుకున్న దిశ.. అనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్ని తన కెరీర్ కు సంబంధించిన విషయాలు పంచుకుంది..
Also Read : Salman khan : విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్..
దిశ మాట్లాడుతూ..‘ఎన్నో ఆశలతో కేవలం రూ.500 లతో ముంబయికి వచ్చాను. చాలా ఆడిషన్లకు వెళ్లేదాన్ని. ఎక్కువగా టీవీ వాణిజ్య ప్రకటనల కోసం వెళ్లాను. ఈ క్రమంలో ఒక సినిమాకు సంతకం చేశాను. అదే నా మొదటి చిత్రం. అది ప్రారంభం కావడానికి ముందే నన్ను తొలగించారు. నా స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. ఈ విషయంలో నేనేం బాధపడలేదు. కానీ ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉంటుంది. తిరస్కరణలే నన్ను మరింత బలంగా చేస్తాయని నమ్ముతా’ అని తెలిపింది దిశ.