రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందని కోలీవుడ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలైవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే అలా అయినా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు దర్శకుడు సెట్ కావడం లేదు. లోకేశ్ కనగరాజ్ తప్పుకున్నాడన్న టాక్ నుండి ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ఫైనల్ కాలేదు. సి సుందర్ ఓకే అయినప్పటికీ హారర్ కథ నేరేట్ చేయడంతో ఈ స్టోరీ తనకు సెట్ కాదని తలైవా తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు ఖుష్బు హస్బెండ్.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ పొటెన్షియల్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సరిగా చూపించలేదు : మైత్రీ రవి
మరి తలైవా 173ని దర్శకుడు ఎవరూ అన్న ప్రశ్నకు. . లోకీ నుండి కార్తీక్ సుబ్బరాజ్ వరకు పేర్లు వినిపించాయి. కానీ వీరందరినీ కాదని యంగ్ ఫిల్మ్ మేకర్‌కు ఛాన్స్ ఇచ్చారట కోలీవుడ్ సూపర్ స్టార్స్ తలైవా అండ్ ఉళగనాయగన్. పార్కింగ్ ఫేం రామ్ కుమార్ బాలకృష్ణన్ చేతికి డైరెక్షన్ పగ్గాలు అప్పజెప్పారన్నది కోలీవుడ్ లేటెస్ట్ టాక్. రామ్ నెరేట్ చేసిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ రజనీ- కమల్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నెక్ట్స్ ఇయర్ మార్చి నుండి ప్రాజెక్ట్ పటాలెక్కే ఛాన్స్ ఉందన్నది లెటెస్ట్ సమాచారం. అయితే తలైవా కన్నా ముందు రామ్ కుమార్ శింబు 49ని డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. ఎనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో జరిగింది. అనుకోని కారణాల వలన ఆ సినిమా ఆగింది. మరి రామ్ కుమార్ బాలకృష్ణన్ ముందుగా శింబుతో సినిమా చేస్తాడా లేదా రజినితో చేస్తాడా అనే క్లారిటీ రావాల్సి ఉంది.