రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898ఎడి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా కల్కి చిత్రం సూపర్ హిట్ అయి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన మా చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ నటులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు, రేపటికోసం.. అంటూ చేసిన ఒక పోస్ట్ ఇద్దరి దర్శకుల అభిమానుల మధ్య వివాదానికి కారణం అయింది. నాగి చేసిన పోస్ట్ యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని ఉద్దేశించి చేసాడని, సందీప్ రెడ్డి రీసెంట్ హిట్ ‘యానిమల్’ చిత్రంలో భూతు, బ్లడ్, ఆడవారిని తక్కువ చేసి చూపించడం వంటివి ఎక్కువ మోతాదులో చూపించాడు. నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సందీప్ ను ఉద్దేశించినవే అని కామెంట్లు పెడుతున్నారు.
నాగ్ అశ్విన్ చేసిన ఆ పోస్ట్ వివాదానికి కారణామవడంతో కాసేపటి తర్వాత ఆ పోస్ట్ ను తొలగించాడు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగింది. కానీ అసలు ఈ వివాదం సందీప్ మొదలెట్టాడని గతంలో యానిమల్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ “మహానటి చిత్రాన్నీ చూశాను, నేను అయితే ఇంకోలా తీసేవాడిని, భవిష్యత్తులో మహానటి లాంటి సినిమా చేసి ఇంకా బెటర్ గా తీస్తాను” అనే భావం వచ్చేలా అన్నాడు. అప్పటి సందీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇప్పడు కల్కితో సమాధానం ఇచ్చాడని డిబేట్ చేస్తున్నారు నాగి ఫ్యాన్స్. సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ చిత్రంతో కల్కి రికార్డులు బద్దలు కొడతాడని సందీప్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక పోస్ట్ తో ఇద్దరు సూపర్ హిట్ డైరెక్టర్ల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది.