అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో కలిసి…సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్పినట్టే వచ్చి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టి పెద్ద పండుగ సంక్రాంతిని కాస్తా పెద్ద నవ్వుల పండుగగా మార్చేశారు.OTTలో సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు కదిలొచ్చి థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేశారు.అలాగే ఈ సినిమాతో వరుసగా ఎనిమిదో విజయం దక్కించుకున్న అనిల్ రావిపూడి టాలీవుడ్ లో డైరెక్టర్ గా 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా NTV కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూ లో త్వరలో చిరంజీవితో చెయ్యబోతున్న సినిమా గురించి మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో సినిమా ఎలా మిస్ అయ్యింది లాంటి అన్ టోల్డ్ ఫాక్ట్స్ రివీల్ చేసారు.చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా తర్వాత ఉండే అవకాశం ఉండడంతో ‘విశ్వంభర’ తర్వాత అనీల్ రావిపూడి సినిమా లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మహేష్ తో మరో సినిమా చేసే ఛాన్స్ ఉందా అంటే దానికి కూడా తన స్టైల్ లో ఆసక్తికర సమాధానం చెప్పారు.
తనని హేట్ చేసేవాళ్ళందరికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ చెప్పుకొచ్చారు.అయితే అలాంటివాళ్లను ఎప్పుడూ పట్టించుకోను అని,ఈ సినిమా హిట్ అయినంత మాత్రాన వాళ్ళు మారిపోరు అంటూ తన మార్క్ ఆన్సర్ ఇచ్చిన అనిల్ పాన్ ఇండియా సినిమా కి ఎంటర్ అవ్వడానికి టైం ఉందని,అలాగే ఫ్యూచర్ లో నటుడిగా కూడా కొనసాగుతా అంటూ ఎంటర్టైనింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.
అనిల్ రావిపూడి లేటెస్ట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి