టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒకప్పుడు రాజు గారి సినిమా అంటే అటు ప్రేక్షకుల్లోను ఇటు బిజినెస్ సర్కిల్స్ లోను మినిమమ్ గ్యారెంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రీయేటివ్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు దిల్ రాజు. కానీ అదంతా గతం. ఇటీవల కాలంలో దిల్ రాజూ నిర్మాణంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ ఈఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాం తో పాటు గేమ్ ఛేంజర్ తో వచ్చాడు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ ప్లాప్ కాగా సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు లిస్ట్ ఇదే.?
గేమ్ ఛేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం క్లియర్ చేసింది. పాన్ ఇండియా మూవీతో ప్లాప్ కొట్టినా కూడా దిల్ రాజు ఎక్కడ ఆగట్లేదు. ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ ను నమ్మి భారీ డిజాస్టర్ ను తెచుకున్న దిల్ రాజు. ఈ సారి ఏకంగా మలయాళ దర్శకుడిని లైన్ లో పెడుతున్నాడు దిల్ రాజు. ఇటీవల మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా ‘మార్కో’ సినిమాను తెరకెక్కించాడు హనీఫ్ అదేని. ఈ దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందించబోతున్నాడు దిల్ రాజు. అయితే ఈ సినిమాను ఇద్దరు హీరోలతో కలిసి చేస్తారని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారకంగా ప్రకటించనున్నారు దిల్ రాజు.