web series : గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కోవై సరళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. అలా తెలుగులో డబ్ అయ్యి వచ్చిన సినిమాలను మాత్రమే తెలుగు వాళ్ళు చూసి ఆనందించాల్సిన వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కోవై సరళ ఓ తెలుగు వెబ్ సీరిస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోందట.
Also Read: Retro : రూ.100 కోట్ల క్లబ్‌లో సూర్య ‘రెట్రో
Also Read
యంగ్ హీరోయిన్ రీతూ వర్మ, శివ కందుకూరి జంటగా నటిస్తున్న వెబ్ సీరీస్ ‘దేవిక అండ్ డానీ’. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయింది. రీతూవర్మ కు ఇదే మొదటి వెబ్ సీరిస్. ‘శ్రీకారం’ మూవీ ఫేమ్ బి. కిశోర్ ఈ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశాడు. అతనితోపాటు ఇందులో సూర్య వశిష్ఠ, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయ్ క్రిష్ దీనికి మ్యూజిక్ అందించాడు. త్వరలో ఈ వెబ్ సీరిస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి కోవై సరళ కామెడీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలుగువారికి ఆమె ఈ వెబ్ సీరిస్ తో ఎలాంటి వినోదాన్ని పండిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..