HanuMan 2 : టాలీవుడ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. తేజ సజ్జా కాదు ‘హను-మాన్ 2’లోకి మెగా హీరో ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన ‘హను-మాన్’ లెగసీని ముందుకు తీసుకెళ్తూ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ఒక భారీ సంచలనానికి తెరలేపింది. ప్రేక్షకులు అస్సలు ఊహించని రీతిలో ఒక బిగ్, యాంబిషియస్ సినిమాటిక్ స్పెక్టాకిల్‌ను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అదే ‘హను-మాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ (HanuMan 2 – The Rise of Vanaras)! అయితే ఇందులో అసలైన సెన్సేషన్ ఏంటంటే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విఐ ఆనంద్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్ చూస్తుంటేనే ఇదొక భారీ విజువల్ వండర్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఆకాశంలో దట్టమైన మేఘాల మధ్య ఆంజనేయ స్వామి భారీ దివ్య రూపం కనిపిస్తుండగా, పైనుంచి కిందకు దిగివచ్చిన ఒక భారీ వానర తోక.. కాషాయ వస్త్రం ధరించిన హీరో వైష్ణవ్ తేజ్‌ను చుట్టుకుని గాల్లోకి ఎత్తుతున్నట్లుగా డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. బ్యాక్ పోజ్‌లో కండలు తిరిగిన దేహంతో వైష్ణవ్ తేజ్ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలతో తనదైన ఫాంటసీ, థ్రిల్లర్ మార్క్ చూపించిన దర్శకుడు విఐ ఆనంద్.. ఈసారి “ఎ విఐ ఆనంద్ ఫాంటసీ” (A VI Anand Fantasy) అంటూ మరింత భారీ ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. వరుస ప్రయోగాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న వైష్ణవ్ తేజ్ కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్, గేమ్-ఛేంజింగ్ ప్రాజెక్ట్ కాబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే హను-మాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకి సీక్వెల్ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రైమ్‌షో ప్రకటించిన సినిమా ఏంటి? హను- మాన్ సినిమాకి దీనికి సంబంధం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది అనేది హాట్ టాపిక్ గా మారాయి.
Also Read
- Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'.. కానీ ఒక్క కండిషన్?
- Telugu Movie Piracy: టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ఒకే వెబ్సైట్లో 4 కొత్త సినిమాలు లీక్..
- Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
- దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
తాజావార్తలు
-
HanuMan 2 : టాలీవుడ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. తేజ సజ్జా కాదు ‘హను-మాన్ 2’లోకి మెగా హీరో ఎంట్రీ?
-
Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. కానీ ఒక్క కండిషన్?
-
New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Hardik Pandya Trade: హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!