లేడీ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో…
కోవై సరళ.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది. ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. లేడీ కమెడియన్ గా మే కు ఉన్న గుర్తింపు మరెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే క్వీన్ కోవై సరళ అనే చెప్పాలి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019 లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె…
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను…