జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర మొత్తానికి థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర విడుదలయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన దేవర ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అభిమానుల కోలాహలం, బాణాసంచాలు ఎటు చుసిన దేవర థియేటర్లు తిరునాళ్లను తలపించాయి, నిన్నరాత్రి నుండి మొదలైన సంబరాలు తెల్లవారుజాము వరకు సాగుతూనే ఉన్నాయి.
Also Read : Devara : నైజాం – నార్త్ అమెరికా దేవర అడ్వాన్స్ కలెక్షన్స్ వివరాలు..
దేవర ప్రీమియర్స్ తెల్లవారుజామున 1.08 షోస్ కాసేపటి క్రితం ముగిసాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను మొదటి భాగం అలరించగా, సెకండ్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉందని కొందరు అన్నారు. కొరటాల చచెప్పినట్టుగా ఏ విధమైన అంచనాలు లేకుండా, నార్మల్ ఆడియెన్ గా చూసే వారికి దేవర విశేషంగా అలరించాడు. ఓవర్ ఆల్ గ చూసుకుంటే దేవర ఒకసారి చూడదగ్గ సినిమా. కాగా రాజమౌళి తో సినిమా చేస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ ను తొలిసారి ఎన్టీయార్ బ్రేక్ చేసాడని, సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది అని టాక్. కాగా దేవర పాత్రలో యంగ్ టైగర్ అదరగొట్టాడని తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను తన భుజస్కందాలపై మోశాడు, మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నడుస్తున్న రాజమౌళి సెంటీమెంట్ ను కొరటాల శివ బ్రేక్ చేసాడు. ఆచార్య వంటి దారుణ ప్లాప్ తర్వాత కొరటాల నుండి ఈ రేంజ్ కంబ్యాక్ ఊహించలేదు అని అన్నారు.