ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి క్రికెటర్ కి తెలుగు ప్రేక్షకులకు లింక్ ఏమిటి అనే అనుమానం మీకు కలగవచ్చు. ఆయన క్రికెటర్ అయినా సరే ఎక్కువగా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకు డైలాగ్స్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ చేస్తున్న అన్ని సినిమాల పాటలు డైలాగ్స్ తో వీడియోలు చేస్తూ ఆయన అభిమానులకు దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్లుగా తాజాగా ఒక లీక్ బయటికి వచ్చింది.
Posani Krishnamurali: పోసానికి నరసరావుపేట కోర్టు 14 రోజుల రిమాండ్
అసలు విషయం ఏమిటంటే జీవి ప్రకాష్ కుమార్ హీరోగా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన కింగ్స్టన్ అనే సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రాబిన్ హుడ్ హీరో నితిన్ తో పాటు ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల హాజరయ్యారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా హాజరయ్యారు. రవిశంకర్ ని రాబిన్ హుడ్ సినిమా గురించి ఏదైనా లీక్ ఇవ్వమని అంటే ఇబ్బంది పడుతూనే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్న విషయాన్ని బయట పెట్టాడు. ఈ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని వెల్లడించాడు.