నరసరావుపేట జిల్లా కోర్టులో పోసాని కృష్ణ మురళిని ప్రవేశ పెట్టారు పోలీసులు. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదు అయింది. నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు. దీంతో పీటీ వారెంట్‌పై రాజంపేట సబ్‌జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్న సరసరావుపేట పోలీసులు నరసరావుపేట జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో నరసరావుపేట జిల్లా కోర్టు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరసరావుపేట సబ్ జైలుకు పోసాని కృష్ణ మురళిని తరలించారు పోలీసులు. మరోపక్క పీటీ వారెంట్ పై రేపు పోసానిని బాపట్ల తరలించనున్నారు పోలీసులు.
Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!
నిజానికి రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. గత నాలుగు రోజులుగా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు ఇచ్చారు. తాము కోర్టు అనుమతి తీసుకున్నాం అని, ముందుగా తమకే పోసానిని అప్పగించాలని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు కూడా పరిశీలించారు. ఉన్నతాధికారుల అనుమతితో నరసరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు.