ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఒక స్పెషల్ క్యామియోలో కనిపించనున్నాడని ప్రకటించినప్పుడు, ఈ క్రికెటర్ తెలుగు సినిమా తెరపై ఏం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంతేకాదు, సినిమా ప్రచార కార్యక్రమాల్లో వార్నర్ చురుగ్గా పాల్గొనడంతో అతని పాత్ర ఏదో పెద్దది,…
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి క్రికెటర్ కి తెలుగు ప్రేక్షకులకు లింక్ ఏమిటి అనే అనుమానం మీకు కలగవచ్చు. ఆయన క్రికెటర్ అయినా సరే ఎక్కువగా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకు డైలాగ్స్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ చేస్తున్న అన్ని సినిమాల పాటలు డైలాగ్స్ తో వీడియోలు చేస్తూ ఆయన అభిమానులకు దగ్గరయ్యాడు.…