టాలీవుడ్ లో ఫెస్టివల్ సీజన్ అంటేనే సినిమాలకు గోల్డెన్ డేస్ అని అర్ధం. మరి ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల వేల టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నఅదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు అంటే అర్ధం చేసుకోండి ఫెస్టివల్ సీజన్ అంటే ఎంతటి డిమాండ్ అనేది.
Also Read : N convention : నాగార్జున పై కేసు నమోదు
కాగా మరో వారంలో రానున్న దసరా రిలీజ్ కూడా ఇటువంటి పోటీనే నెలకొంది. కాకుంటే ఇక్కడ చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలాగే డబ్బింగ్ సినెమాలు సైతం దసరా భరిలో నిలిచాయి. వీరిలో అందరి కంటే ముందుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ ది హంటర్ అక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక 11న శ్రీను వైట్ల, గోపీచంద్ ల విశ్వం. సుధీర్ బాబు మా నాన్న సువర్ హీరో, డబ్బింగ్ చిత్రాలైన అలియాభట్ జిగ్రా, కన్నడ సినిమా మార్టిన్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇక పండగ రోజు అనగా 12 న వస్తోంది సుహాస్ జనక అయితే గనక. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి వీటిలో హిట్ అయ్యేది ఎవరో ఫట్ అయ్యేది ఎవరో.