ఇటీవల వెండితెర నటీమణుల మాదిరిగానే, బుల్లితెర నటీమణులు కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అయితే అందుకోసం వారు రకరకాల మేకప్ సామగ్రితో పాటు నగలు కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. అలా నగలు తెచ్చుకుంటున్న ఓ నటి నుంచి నగలు దొంగిలించడానికి యత్నించి పట్టుపడ్డాడు ఓ కానిస్టేబుల్. ప్రస్తుతం బుల్లితెరలో అనేక తమిళ సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటిస్తున్న రేణుక ఇచ్చిన సమాచారం సంచలనం రేపింది. రేణుక కావేరి ఎక్స్‌ప్రెస్ రైలులో మైసూర్ నుండి చెన్నైకి ప్రయాణిస్తుండగా ఒక షాకింగ్ సంఘటన జరిగింది. రైలు ఆవడి అనే స్టేషన్ కు వచ్చినప్పుడు, నటి రేణుక హ్యాండ్‌బ్యాగ్‌లో కొన్ని నగలు ఉన్నాయని ఓ వ్యక్తి గమనించాడు. ఎలాగైనా ఆమె నుండి హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. రేణుక నగల సంచిని దొంగిలించి వెళ్ళిపోతుండగా నటి దృష్టిని ఆకర్షించాడు.
CP Sudheer Babu : పసి బిడ్డలను అమ్ముకుంటున్న ముఠా అరెస్ట్
నటి దీనిని గమనించి, బ్యాగ్‌ను తన చేతికి ఇవ్వమని కేకలు వేసింది, కానీ ఆ వ్యక్తి నగలు ఉన్న బ్యాగ్‌ను బయట విసిరేశాడు. రైలులోని ఇతర ప్రయాణికుల నుంచి ఆ వ్యక్తి తప్పించుకునేలోపు పట్టుకోవడానికి ప్రయత్నించగా, నటి వెంటనే నైపుణ్యంగా వ్యవహరించి, ఎమర్జన్సీ రెడ్ చైన్ లాగి రైలును ఆపివేసింది. తరువాత, రైల్వే అధికారులు గొలుసు ఎందుకు లాగారని అడిగినప్పుడు, ఆ వ్యక్తి తన నగలు ఉన్న తన హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగిలించానని చెప్పి, అతన్ని పోలీసులకు అప్పగించింది. ఇక కిందకు వెళ్లి నగలు ఉన్న బ్యాగ్‌ను తిరిగి తెచ్చుకుంది. ఆ తర్వాత వాలాజావాయి వసంతకుమార్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేశాడని తెలిసింది. అతను చెన్నైలోని ఒట్టేరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఈ దొంగతనం సంఘటన నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేసినట్లు కూడా చెబుతున్నారు.