సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాథరావు మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా తనకు ఈ మజాకా సినిమాకి సీక్వెల్ గా డబుల్ మజాకా సినిమా చేయాలని నిర్మాతలు అంటున్నారని అన్నారు.
L2E EMPURAAN: ‘L2E ఎంపురాన్’లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ జెరోమ్ ఫ్లిన్.. అదిరిందిగా!
కథ కుదిరితే తాను వెంటనే ఈ సినిమాను పట్టాలు ఎక్కిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే తన డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాకి కూడా సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నానని అన్నారు. అయితే అందులో రవితేజ హీరోగా నటిస్తేనే బాగుంటుందని ఆయనతోనే సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఏకైక వంద కోట్ల సినిమాగా నిలిచింది ఈ ధమాకా సినిమా. మరో సీక్వెల్ ఎవరితో ప్లాన్ చేస్తారు? అనేది వేచి చూడాల్సి ఉంది.