సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. ఈ నెల 10న విడుదల కానున్న ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, సిద్ధార్థ్, దర్శకత్వంలోనూ ఆసక్తి చూపిస్తూ సృజనాత్మక పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నాడని, ఇది భాస్కర్‌కు అసంతృప్తి కలిగించిందని, ఒక పాటను భాస్కర్ లేకుండా చిత్రీకరించారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వ్యాపించాయి. ఈ రోజు నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ్ మరియు భాస్కర్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు. సినిమా అనేది టీం వర్క్ తో కూడిన ప్రక్రియ, అందరూ చిత్రం కోసం శ్రమిస్తారు, తమ డిస్కషన్ గదిలోకి వెళ్తే అది ఒక యుద్ధ రంగంలా అనిపిస్తుందని, సినిమా కోసం తాము వాదించుకుంటాం, తిట్టుకుంటాం కొట్టుకునేదాకా వెళ్తాము, కానీ ఆ గది నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతామని భాస్కర్ అన్నారు.
Prabhas : ‘స్పిరిట్’ లో వర్మ.. అలా అనేశాడు ఏంటి
సిద్ధార్థ్‌కు అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉందని, అది సినిమాకు ఒక బలంగా మారుతుందని, ఒక సన్నివేశాన్ని అతనికి అప్పగించి నిశ్చింతగా ఉండవచ్చని, కెమెరా వద్ద ‘రోలింగ్..కట్’ అని చెప్పడమే సరిపోతుందని భాస్కర్ అభిప్రాయపడ్డారు. సిద్ధార్థ్ కూడా గండిపేట వద్ద ఒక పాటను దర్శకుడు లేకుండా తీశామని, అయితే ఆ సమయంలో భాస్కర్ ఎడిటింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని అన్నారు, ‘మీరు ఏసీ గదిలో పని చేయండి, మేము ఎండలో కష్టపడతాం’ అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నామని, భాస్కర్‌కు తెలియకుండా లేదా ఆయన అనుమతి లేకుండా సాంగ్ షూట్ ఎలా సాధ్యమవుతుందని సిద్దూ జొన్నలగడ్డ మీడియాను ప్రశ్నించారు.