టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణ వార్త చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కన్నుమూశారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో రవి తేజ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రాజ గోపాల్ రాజు గారి కుటుంబానికి ఓర్పు కలగాలని సినీ వర్గం కోరుతోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రగాడ సానుభూతి తెలిపారు. ఒక భావోద్వేగపూరిత సందేశంతో..
Also Read : R. Madhavan : దాని కారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇబ్బంది పడలేదు..
‘సోదరుడు రవి తేజ తండ్రి శ్రీ రాజ గోపాల్ రాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని చివరిసారిగా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సెట్‌ల్లో కలిశాను. ఎంతో ఆదరణగా, సాదాసీదాగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. ఈ కష్ట సమయంలో రవి తేజ గారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తపరిచిన భావోద్వేగపూరిత సానుభూతి మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.