ఇన్నేళ్లుగా వివిధ భాషల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్, తాజాగా ‘ఆప్ జైసా కోయి’ సినిమాతో మరోసారి తెరపై కనిపించాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇటీవల దేశంలో చర్చనీయాంశంగా మారిన భాషా వివాదంపై స్పందిస్తూ.. తనదైన శైలిలో స్పష్టమైన అభిప్రాయం వెలడించారు.
Also Read : Pawankalyan: హరిహర వీరమల్లు – నెక్ట్స్ సాంగ్ కి డేట్ ఫిక్స్!
‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో భాష కారణంగా నేను ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కోలేదు. అలాంటి అనుభూతిని ఎప్పుడూ అనుభవించలేదు. నేను తమిళం, హిందీ రెండూ మాట్లాడతాను. అలానే నేను కొల్హాపూర్‌లో చదువుకున్నాను అలా మరాఠీ కూడా నేర్చుకున్నాను. అందుకే భాష కారణంగా నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు’ అని అన్నారు. అందుకే ఆయన హిందీ, తమిళంతో పాటు పలు భాషల్లో నటించి అన్ని ప్రాంతాల్లో అభిమానులను సంపాదించగలిగాడు.
మాధవన్ అభిప్రాయం ప్రకారం, భాషా భేదాలు అనవసరం అని చెప్పకనే చెబుతున్నాడు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సంస్కృతులు, భాషలు ఉంటాయన్న విషయం కూడా ఆయన గుర్తుచేశారు . ఈ వివాదం మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్, మరాఠీ తో పాటు హిందీని మూడో భాషగా బోధించాలనే ప్రతిపాదనతో మొదలైంది. ఈ విషయంపై ప్రజల్లో, పలువురు ప్రముఖులలో చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. అయితే, కొందరు సెలబ్రిటీలు దీనిపై మాట్లాడటానికి తర్జన భర్జన పడగా, మాధవన్ మాత్రం నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడమే కాక, తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. ఇది అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతోంది.